- సెప్టెంబర్ 30 వరకు గడువు
- అప్పటి వరకు చలామణీలోనే..
- మార్పిడికి పరిమితి విడతకు రూ.20 వేలు
- డిపాజిట్‌కు పరిమితి లేదు
- అనిు బ్యాంకుల్లోనూ మార్చుకోవచ్చు
- నోట్ల రద్దు అవాంఛనీయ బిడ్డే ఈ పెద్ద నోటు అని వ్యాఖ్య
ముంబయి: రానున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం రూ.2,000 నోట్ల ఉపసంహరణకు పూనుకుంది. ఈ సారి ప్రభుత్వం నేరుగా కాకుండా భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) చేత ఈ ప్రకటన చేయించింది. 'క్లీన్ నోట్ పాలసీ' కింద రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ శుక్రవారం నాడిక్కడ వెల్లడించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 23 నుంచి రూ.2,000 నోట్లను అన్ని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. అప్పటి వరకు పెద్ద నోట్లను చట్టబద్ధంగా లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. 2018 నోట్ల రద్దు నుంచి పుట్టుకొచ్చిన అవాంఛనీయ బిడ్డే ఈ రూ.2,000 నోటు అనిఅది వ్యాఖ్యానించింది. ఇకపై ఎవరికీ రూ.2వేల నోట్లను జారీ చేయవద్దనిబ్యాంక్‌లకుఆదేశాలు జారీ చేసింది. మే 23 నుంచి ఏ బ్యాంక్ శాఖలో అయినా ఈ నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు వీలు కల్పించింది. అయితే.. ఒకసారి రూ.20,000 వరకు మాత్రమే ఈ నోట్లను మార్చుకునేందుకు వీలుంది. వ్యక్తిగతంగా డిపాజిట్ చేయాలనుకుంటే ఎలాంటి నిబంధన లేకుండా ఎంత మొత్తం అయినా డిపాజిట్ చేసుకునే వీలు కల్పించింది. దేశంలోని 19 ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పించింది.
2016 నవంబర్ 8న ప్రధాని మోడీ అనుహ్యంగా రూ.500, రూ.1000 పెద్ద నోట్లను రద్దు చేస్తునాుమని ప్రకటించారు. వాటికంటే పెద్ద నోటు రూ.2000 తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో నల్లధనం దాచుకునే వారికి మరింత సులభం అయ్యిందనే విమర్శలు వెళ్లువెత్తాయి. ఆర్‌బిఐ యాక్ట్ 1934లోనిసెక్షన్ 24(1) ప్రకారం.. 2016 నవంబర్‌లో రూ.2వేల నోటును ఆర్‌బిఐ చలామణిలోకి తీసుకొచ్చింది. మార్చి 2017 నాటికి మొత్తం కరెన్సీలో రూ.2000 నోట్ల వాటా విలువ 89 శాతంగా ఉంది. 2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్లు (37.3శాతం), 2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్లు లేదా10.8 శాతానికి పెద్ద నోట్ల చలామణి తగ్గింది. 2018-19 నుంచి ఈ నోట్ల ముద్రణను ఆర్‌బిఐ పూర్తిగా నిలిపివేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2,000 నోట్ల చలామణీని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్‌బిఐ ప్రకటించింది.2వేల రూపాయల నోటు చాలా కాలంగా ఎటిఎంలలో అందుబాటులో లేవు. ఎప్పుడో ఒకప్పుడు దీనిని రద్దు చేయవచ్చను వార్తలు వినిపిస్తునాుయి. అయితే, అందుకు ఎంచుకున్న సమయం పలు అనుమానాలకు తావిస్తునుదనినిపుణులు కొందరు వ్యాఖ్యానించారు. 2018లో పెద్ద నోట్ల రద్దును ప్రవేశపెట్టినప్పుడు నల్ల ధనానిు దాచుకోవాలనుకునే వ్యక్తులకుఅవి చాలా సౌకర్య వంతంగా ఉనాుయని, నల్లధనానిు వెలికితీయడమే నోట్ల రద్దు ఉద్దేశమని కేంద్రంలో మోడీ ప్రభుత్వం చెప్పింది. అయితే, ఆ వెంటనే రూ.2,000 నోటును జారీ చేయడం వివాదాస్పదమైంది.
- నకిలీ నోట్ల హల్‌చల్
రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చిన తర్వాత దేశంలో నకిలీ నోట్ల బెడద వంద శాతం పైగా పెరిగింది. 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి రూ.2 వేల నోట్లను ప్రవేశ పెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణంకాలే పేర్కొంటునాుయి. 2016లో దేశవ్యాప్తంగా నకిలీ రూ.2వేల నోట్లు 2,272 పట్టుబడగా.. 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు 2.45 లక్షలకుచేరిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాలు స్పష్టం చేస్తునాుయి.










