Mar 06,2023 07:55

ఆ రోజు
వరద వచ్చింది
తర్వాత రోజు
పులిహౌర వచ్చింది
అప్పుడే
సుంకులమ్మ గుడి ముందు కూర్చొని
తడి కళ్ళతో
గర్భగుడిలోని అమ్మను చూస్తూ
ఆ వేడి పులిహౌరను తిన్నాము.

వరద గుర్తుకు వచ్చిన ప్రతిసారీ
ఆ దృశ్యం కళ్ళ ముందు తిరుగుతుంది
హృదయాన్ని బరువెక్కిస్తుంది !
- లక్ష్మి కందిమళ్ళ