ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ప్రెషర్స్‌కు షాక్ ఇచ్చింది. మొదట ఆఫర్ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. ఈ మేరకు ఫ్రెషర్స్‌కు విప్రో కంపెనీ ఈ -మెయిల్ పంపినట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ తెలిపింది. ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో విప్రో కంపెనీ కొద్ది నెలల క్రితమే శిక్షణ తీసుకుంటున్న వారిలో పనితీరు సరిగ్గా లేదని 425 మందిని ఇంటికి పంపిన విషయం తెలిసిందే. తాజాగా ట్రైనింగ్ పూర్తయి ప్యాకేజీతో ఉద్యోగంలో తీసుకునే వారి జీతాల్లో కూడా కోత విధించింది. ఫ్రెషర్లకు గతంలో 6.5 లక్షల వేతన ప్యాకేజీ ఆఫర్ ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని 3.5 లక్షలకు కుదించింది. సగం ప్యాకేజీతోనే ఫ్రెషర్స్ అంగీకరిస్తేనే విధుల్లో చేరాలని విప్రో కంపెనీ మెయిల్ సమాచారంగా ఉంది.










