Oct 18,2023 21:01

క్యూ2లో 5,015 మంది ఉద్యోగుల తగ్గుదల
బెంగళూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో దిగ్గజ ఐటి కంపెనీ విప్రో నికర లాభాలు స్వల్పంగా పెరిగి రూ.2,667 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,649 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ2లో కంపెనీ రెవెన్యూ 0.1 శాతం తగ్గి రూ.22,520 కోట్లుగా చోటు చేసుకుందని ఆ కంపెనీ బుధవారం బిఎస్‌ఇ ఫైలింగ్‌లో తెలిపింది. ''మార్కెట్‌లో సూక్ష్మ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రగతిని కనబర్చాము. గడిచిన త్రైమాసికంలో 100 మిలియన్‌ డాలర్ల పైగా విలువ కలిగిన 22 ఎకౌంట్లను పొందాము. 2020-21తో పోల్చితే ఇది రెట్టింపు. గడిచిన తొమ్మిది నెలల్లో 1.3 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పెద్ద కాంట్రాక్టును పొందాము.'' అని విప్రో సిఇఒ తియెరి డెలపొర్టీ పేర్కొన్నారు.
గడిచిన జులైా సెప్టెంబర్‌ కాలంలో విప్రో ఉద్యోగుల్లో 5,015 మంది తగ్గారు. దీంతో వరుసగా నాలుగో త్రైమాసికంలో నికర ఉద్యోగుల్లో తగ్గుదల చోటు చేసుకున్నట్లయ్యింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ ఐటి దిగ్గజంలో ప్రస్తుతం 2,44,707 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రస్తుత అక్టోబర్‌ ా డిసెంబర్‌ త్రైమాసకంలో ఐటి సర్వీసుల నుంచి 2,617 ా2,672 మిలియన్‌ డాలర్ల వ్యాపారం జరగొచ్చని అంచనా వేసింది. బుధవారం బిఎస్‌ఇలో విప్రో షేర్‌ విలువ 0.94 శాతం తగ్గి రూ.407.40 వద్ద ముగిసింది.