క్రైస్ట్‌చర్చ్: భారత్ వేదికగా అక్టోబర్‌లో జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్ న్యూజిలాండ్ కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ క్రికెట్‌బోర్డు వన్డే ప్రపంచకప్‌కు ప్రకటించిన 15మందితో కూడిన జట్టును సోమవారం వెల్లడించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లేని జిమ్మీ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఈ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. యంగ్ ఓపెనర్ ఫిన్ అలెన్‌పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు.. కైల్ జేమీసన్, ఆడం మిల్నేలను దూరం పెట్టింది. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రాస్‌వెల్ బోర్డు ప్రకటించిన 15మంది జట్టులో చోటు దక్కలేదు. మోకాలి గాయం నుంచి కోలుకున్న విలియమ్సన్ మరోసారి జట్టును నడిపించనున్నాడు. అతడితో పాటు టిమ్ సౌదీకి ఇది నాల్గో ప్రపంచకప్.
జట్టు: విలియమ్సన్(కెప్టెన్), చాప్మన్, కాన్వే, లాథమ్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్, నీషమ్, ఫిలిఫ్స్, రవీంద్ర, సాంట్నర్, సోధీ, యంగ్, బౌల్ట్, సౌథీ, ఫెర్గూసన్, హెన్రీ.










