Apr 06,2023 21:21

హైదరాబాద్‌ : తేలికపాటి పసిడి అభరణాలను విక్రయించే మెలోరా తమ స్టోర్లను ద్వితీయ శ్రేణీ నగరాలకు విస్తరిస్తామని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నూతన స్టోర్‌ను గురువారం ఆ సంస్థ ఫౌండర్‌, సిఇఒ సరోజా యెర్రమిల్లి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సరోజా మీడియాతో మాట్లాడుతూ.. ఇది తెలంగాణలో తమకు తొలి అవుట్‌లెట్‌ అని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు ఉన్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో ఫ్రాంచైజీ పద్దతిలో 500 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో స్టోర్లను అందుబాటులోకి తేనున్నామన్నారు. హైదరాబాద్‌లో ఐదు స్టోర్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.700 కోట్ల టర్నోవర్‌ సాధించామన్నారు. గడిచిన నాలుగేళ్లలో సగటున 170 శాతం వృద్థిని నమోదు చేశామన్నారు. బెంగళూర్‌లో తమకు తయారీ కేంద్రం ఉందన్నారు.