- నేడు భారత్-కువైట్ జట్ల మధ్య ఫైనల్
బెంగళూరు: శాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ శ్రీ కంఠీరవ స్టేడియంలో భారత్-కువైట్ జట్ల మధ్య జరగనుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారతజట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-2గోల్స్ తేడాతో లెబనాన్‌పై, కువైట్ జట్టు 1-0తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకొచ్చాయి. లీగ్ దశలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్-కువైట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. గ్రూప్-ఏలో కువైట్, భారత్ 7పాయింట్లతో సమంగా నిలిచినా.. ఒక గోల్ ఎక్కువ కొట్టిన కువైట్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు రెండుసార్లు తలపడ్డ ఈ రెండుజట్ల మధ్య ముఖాముఖి పోరులో 0-1తో భారత్ వెనుకబడి ఉండగా.. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. సెమీస్‌లో భారత్-లెబనాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను సుమారు 20వేలమంది ప్రేక్షకులు హాజరయ్యారు. టోర్నీలో భారతజట్టు అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తోంది.