
అమీర్‌పేట (హైదరాబాద్) : మహిళ స్నానం చేస్తుండగా ... రహస్యంగా వీడియో తీస్తున్న యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం అమీర్‌పేటలో జరిగింది.
ఇన్‌స్పెక్టర్ సైదులు కథనం మేరకు ... అమీర్‌పేట చిన్నగురుద్వారా సమీపంలోని ఓ మహిళ (31) శనివారం స్నానం చేస్తుండగా ఆ ఇంటి పక్కనే హాస్టల్‌లో ఉంటున్న కిరణ్ (22) హాస్టల్ టెర్రస్ పై నుంచి కిందికి దిగి బాత్రూం ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం నుంచి సెల్ ఫోన్‌తో వీడియో తీశాడు. ఇది గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో వెంటనే చుట్టుపక్కలవారు నిందితుడిని పట్టుకుని చితకబాది ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. అతని సెల్‌ఫోన్‌లో ఈ తరహా వీడియోలు చాలా ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.