
ఇంటర్నెట్‌డెస్క్ : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా కొత్త పరిచయాలను జోడించడానికి లేదా వాటిని సవరించడానికి ఇదెంతో ఉపయోగపడనుంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ వినియోగదారులకు ఫేస్‌బుక్ స్టోరీస్ వంటి వాటిని పంచుకునేందుకు సులభతరం చేయనుంది ఈ ఫీచర్. వాట్సాప్‌ను క్లోజ్ చేయకుండానే ఈ కొత్త ఫీచర్‌తో మిగతా కాంటాక్ట్స్‌ను మేనేజ్ చేయవచ్చు. వాట్సాప్‌లోని కాంటాక్ట్ లిస్ట్‌ని తెరిచి 'న్యూ కాంటాక్ట్' అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా కొత్త ఫీచర్‌ను పొందవచ్చు. వాట్సాప్‌లో 'న్యూ కాంటాక్ట్' ఫీచర్ అందుబాటులో ఉంటే.. యాప్ నుంచి నిష్క్రమించకుండానే కొత్త పరిచయాలను పెంచుకోవచ్చు. ఇక ఈ ఫీచర్ ద్వారా కాంటాక్ట్ యాప్‌కు మారకుండానే కాంటాక్ట్ లిస్ట్‌కు తెలియని నంబర్‌లను కూడా యాడ్ చేయవచ్చు. అలాగే వినియోగదారులు యాప్ నుండి నిష్క్రమించకుండానే వారి ఫేస్‌బుక్ స్టేటస్, స్టోరీస్‌ను పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇంతకముందు కూడా ఫేస్‌బుక్ స్టేటస్ అప్‌డేట్‌లను వినియోగదారులు షేర్ చేయగలరు. కానీ వారు కొత్తదాన్ని పోస్ట్ చేసిన ప్రతిసారీ అప్‌డేట్‌ను మ్యాన్యువల్‌గా షేర్ చేయాల్సి ఉండేది. కానీ, ఇప్పుడొచ్చే కొత్త ఫీచర్‌లో కాంటాక్ట్స్ కిందనే షేర్ ఫేస్‌బుక్ అనే ఆప్షన్ కూడా వుంటుంది. ఫేస్‌బుక్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా వాట్సప్‌లో పోస్ట్ చేసిన స్టోరీ.. వాట్సప్‌తోపాటు ఫేస్‌బుక్‌లో కూడా వస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎప్పటి అప్‌డేట్‌ని అప్పుడే షేర్ చేసుకునే వీలుంది.