ఇంటర్నెట్‌డెస్క్ : యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ని కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ చేయనుంది. యూట్యూబ్‌లో 'శాంపిల్' అనే కొత్త ఫీచర్‌తో వినియోగదారులు తమకిష్టమైన సంగీతాన్ని వినవచ్చు. ఈ కొత్త యాప్‌లోని 'హోమ్', 'ఎక్స్‌ఫ్లోర్' కొత్త ట్యాబ్ మ్యూజిక్ వీడియోల యొక్క చిన్న స్నిప్పెట్‌లతో రూపొందింది. ఈ ట్యాబ్ పాట యొక్క పూర్తి వీడియోను చూసే అవకాశం ఉంది. ట్యాబ్ టిక్‌టాక్‌లాగా అనిపించినప్పటికీ ఇది ప్రత్యేకంగా మ్యూజిక్ వీడియోలతో రూపొందింది. వినియోగదారులు స్నిప్పెట్‌లపై నొక్కితే.. మీకు నచ్చిన పాట ప్లే అవుతుంది. దానికి సంబంధించిన వీడియోలను చూడవచ్చు. అలాగే వినియోగదారులు తమకిష్టమైన పాటల జాబితాలను కూడా ఈ యాప్‌లో జోడించవచ్చు. ఒకపాట తర్వాత ఒకటి.. నచ్చిన పాటలను ప్లే చేసుకునే అవకాశం కూడా ఉంది. సౌండ్‌ట్రాక్‌గా కొత్త షార్ట్‌ను రూపొందించవచ్చు. ఇప్పటికే ఉన్న ప్లేజాబితాలను పాడ్‌కాస్ట్‌లుగా సెట్ చేయడానికి, పాడ్‌క్యాస్ట్‌ల పనితీరును విశ్లేషించడానికి యూట్యూబ్ స్టూడియో డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఈ ఏడాది మార్చిలోనే కొత్త ఫీచర్లను ప్రకటించింది.