Aug 21,2023 15:10

ఇంటర్నెట్‌డెస్క్‌ : బహుళజాతి సాంకేతిక సంస్థల్లో ఉద్యోగాలు చేయాలంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పిహెచ్‌డి విద్యార్థులు టెక్‌ రంగంలో నిలదొక్కుకోగలుగుతారా? వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే కొత్త పరిశోధకులు అమెరికన్‌ బహుళజాతి సాంకేతిక సంస్థ అయిన ఎన్‌విఐడిఐఎ కంపెనీలో ఉద్యోగం చేయాలంటే.. వారికి తప్పనిసరిగా వ్యక్తిగత వెబ్‌సైట్‌ నిర్వహించడం అవసరమని సోషల్‌మీడయాలో చర్చ జరుగుతోంది. అయితే సోషల్‌మీడియాలో లెవనెత్తిన ప్రశ్నలకు కొందరు పరిశోధకులు మద్దతు తెలిపారు. పరిశోధకులకు వ్యక్తిగత సైట్‌ ఉండడం మంచిదేనని వారు అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా యాక్సెంచర్‌ ల్యాబ్స్‌లో టెక్నాలజీ లీడర్‌ అభినవ్‌ ఉపాధ్యారు రారు దీనిపై మాట్లాడుతూ.. 'సోషల్‌మీడియాలో చర్చ నడిచినట్లు పరిశోధకులలకి వెబ్‌సైట్‌ని కలిగి ఉండడం తప్పనిసరి అని మార్క్‌చేయకూడదు. కానీ పరిశోధకుడు వ్యక్తిగతంగా ఒక సైట్‌ని కలిగి ఉండడం మంచిది. మీరు లింక్డ్‌ ఇన్‌ ప్రొఫైల్‌ కన్నా.. వెబ్‌సైట్‌లో మీ పూర్తి ప్రొఫైల్‌ని, పనిని మెరుగ్గా చేసుకోవచ్చు. అలాగే పరిశోధకుడి యోగ్యతను నిర్ధారించడానికి లోతైన అవగాహన కూడా అవసరం. ముఖ్యంగా ఈరోజుల్లో బిటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులతో కలిసి పిహెచ్‌డి చదివే విద్యార్థులు వారి కోడింగ్‌ పని విషయంలో సహాయం పొందుతున్నారు. ఇలా చేయడం వల్ల పరిశోధకుడికే ఎక్కువ హానికలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టుకు మీరే ప్రధాన కంట్రిబ్యూటర్‌గా ఉంటారు. పిహెచ్‌డి విద్యార్థులకు ప్రపంచంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఐదు - పది సంవత్సరాల క్రితం పిహెచ్‌డి విద్యార్థులకు ఇన్ని అవకాశాలు లేవు. టెక్‌ రంగంలో పిహెచ్‌డి పరిశోధకులుకు ఉద్యోగ అవకాశాలు ప్రస్తుతం బాగానే ఉన్నాయి. అయితే టెక్నాలజీలో ఎఐ (కృత్రిమ మేథస్సు)తో మార్పులు వస్తాయని అనుకుంటున్నా.. దాన్ని వల్ల ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందనే చర్చ అవసరం. అలాంటి టెక్నాలజీని అర్థం చేసుకునే వ్యక్తులు కూడా అవసరం' అని ఆయన అన్నారు.