ఇంటర్నెట్‌డెస్క్ : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ అన్నిరంగాల్లోకి చొచ్చుకొని వస్తోంది. తాజాగా సంగీతంలోనూ అడుగుపెట్టింది. మెటా సంస్థ ఓపెన్ సోర్స్ 'ఆడియో క్రాఫ్ట్' ఎఐ సాధనాన్ని ఆవిష్కరించింది. ఈ ఆడియో క్రాఫ్ట్... మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేసే కళాకారులు లేకుండానే సంగీతాన్ని రూపొందిస్తుందని, ఆర్టిస్టులు చేసే సౌండ్ రికార్డింగ్‌ను ఈ సాధనం సులభంగా రూపొందిస్తుందని మెటా వెల్లడించింది. మ్యూజిక్ జెన్, ఆడియోజెన్, ఎన్‌కోడర్‌లుగా మూడు రకాల మోడల్స్‌ను ఈ ఆడియో క్రాఫ్ట్ తయారుచేస్తుందని మెటా పేర్కొంది. మ్యూజిక్ జెన్ మోడల్.. మెటా సొంత మ్యూజిక్ లైబ్రరీ నుంచి, టెక్ట్స్ ప్రాంప్ట్‌ల నుంచి సంగీతాన్ని అందిస్తుంది. ఆడియోజెన్ మోడల్ పబ్లిక్ సౌండ్ ఎఫెక్ట్‌లలో శిక్షణ పొంది, టెక్ట్స్ ప్రాంప్ట్‌ల నుంచి ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇతర కళాఖండాలతో ఎన్‌కోడెక్ మోడల్ మ్యూజిక్‌ను అందించనుంది. ఇప్పటికే మెటా ఆడియోజెన్ మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇమేజ్‌లు, వీడియో, టెక్ట్స్‌లు ఎఐ సాంకేతికతలో బాగా అభివృద్ధి చెందాయి. కానీ ఆడియో మాత్రం వెనుకబడి ఉందని మెటా అభిప్రాయపడింది.