లండన్ : ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరపోరు కొనసాగుతుండటంతో యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ షోను ఎంటీవీ రద్దు చేసింది. ప్యారిస్‌లో నవంబర్ 5న ఈ పెర్ఫామెన్స్ ప్యాక్డ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఒజున, రెనీ ర్యాప్, థర్టీ సెకండ్స్ టూ మార్స్ సందడి చేయనుండగా చివరి నిమిషంలో ఇది రద్దయింది. ఎంటీవీ యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ గ్లోబల్ మ్యూజిక్ వార్షిక సంబరాలుగా ఏటా అలరిస్తుంటాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా ఇది సంతాపం తెలిపే సందర్భమని కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ షోను అశేష ప్రేక్షకుల ముందుంచేందుకు ప్రపంచవ్యాప్తంగా తరలిరానున్న వేలాది ఉద్యోగులు, సిబ్బంది, ఆర్టిస్ట్‌లు, ఫ్యాన్స్, పార్టనర్స్ భద్రతను దఅష్టిలో ఉంచుకుని మ్యూజిక్ అవార్డ్స్ షోను క్యాన్సిల్ చేయాలనే సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.2024 నవంబర్‌లో యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ ఈవెంట్ జరుగుతుందని ఎంటీవీ పేర్కొంది. గత ఏడాది జరిగిన మ్యూజిక్ అవార్డ్స్‌లో బెస్ట్ ఆర్టిస్ట్, బెస్ట్ వీడియో, బెస్ట్ లాంగ్‌ఫాం వీడియో సహా నాలుగు ట్రోఫీలను గెలుచుకుని టేలర్ స్విఫ్ట్ బిగ్ విన్నర్‌గా నిలిచాడు.