ఇంటర్నెట్‌డెస్క్ : ఎలన్‌మస్క్ యాజమాన్యంలోని 'ఎక్స్'పై ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (ఎఎఫ్‌పి) అనే న్యూస్ కంపెనీ దావా వేసింది. తమ సమాచారాన్ని నగదు చెల్లించకుండా సోషల్‌మీడియాలో ఎక్స్ పోస్టు చేస్తున్నదని.. కాపీరైట్ కింద పారిస్ కోర్టులో ఎఎఫ్‌పి దావా వేసింది. గూగుల్, ఫేస్‌బుక్ కంపెనీలు ఎఎఫ్‌పి న్యూస్‌ని తీసుకుని నగదు చెల్లిస్తున్నాయని, ఈ విషయంపై ఎక్స్ కంపెనీ పట్టించుకోలేదని ఎఎఫ్‌పి తెలిపింది. న్యూస్‌కి సంబంధించిన సంబంధిత డేటాను కూడా ఎక్స్ సమర్పించమని పారిస్ కోర్టు ఆదేశించాలని ఎఎఫ్‌పి సంస్థ కోరింది.