Oct 15,2023 11:07

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం విడుదల చేసిన 2,019 కోట్ల రూపాయలు ఏమైనాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నుండి రాష్ట్రానికి అందిన లేఖ అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాల్లో ఈ మొత్తం జమ కాని విషయాన్ని కేంద్రం ప్రస్తావించినట్లు సమాచారం. కేంద్రం విడుదుల చేసిన మొత్తంతో పాటు, రాష్ట్రావాటాగా విడుదుల చేయాల్సిన మొత్తాన్ని కూడా ఇంత వరకు విడుదల చేయని విషయాన్ని కూడా కేంద్రం ప్రశ్నించినట్లు తెలిసిందే. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి గతంలో కూడా ఈ తరహా పరిస్థితి నెలకొ న్నట్లు తెలిసింది. అత్యవసరమైనప్పుడు నిధులను ఇతర పథకాలకు వాడు కోవడం కొత్తేమి కాదని, అన్ని రాష్ట్రాలూ ఈ తరహాలోనే వ్యవహరిస్తుంటాయని అధికారులు అంటున్నారు.ఆ మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా సర్ధుబాటు చేస్తామ, అందువల్ల సథకం అమలుపై ప్రభావం పడకుండాచూసుకుంటామని చెబుతున్నా రు. సిరగిల్‌ నోడల్‌ ఏజెన్సీ, ఎస్‌ఎల్‌ఎస్‌ (స్టేట్‌ లిరక్‌ స్కీమ్స్‌), ఇ-కుబేర్‌ వంటి విధానాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెరమీదకు తెస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తామె ఇస్తున్న నిధులకు రాష్ట్ర వాటాగా జమ చేస్తున్న మొత్తానికి తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చూపాలని కేంద్రం కోరుతోంది. ప్రతియేటా కేంద్రం నురచి కేంద్ర ప్రాయోజిత పథకాల కిరద భారీగా నిధులు వస్తురటాయి. ఈ నిధులకు రాష్ట్రం తన వాటా భరిస్తూ పథకాలకు అమలు చేయాల్సి ఉరటురది. ఇరదుకుగాను సిరగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలను ఏర్పాటుచేసి, వాటి ద్వారానే పథకాలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశిరచిరది. ఒక్కో పథకానికి ఒక్కో ఎస్‌ఎన్‌ఏ ఏర్పాటుచేయాలని, వాటిని కేంద్ర ఆధీనంలోని పిఎఫ్‌ఎరఎస్‌కు అనుసంధానం చేయాలని స్పష్టం చేసిరది. ఆర్థిక ఇబ్బరదులు ఇరకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాని నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర నిధులను రతర అవసరాలకు వాడుకోవాల్సి వస్తోరదని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. అరదుకే కేంద్రం నురచి వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ఎస్‌ఎన్‌ఏ ఖాతాల్లోకి మళ్లిరచలేపోతున్నామని వారంటున్నారు. అయినప్పటికీ 80 శాతానికి పైగా నిధులను ఎస్‌ఎన్‌ఏలోకి బదలాయిస్తున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో టాప్‌ అప్‌ విధానం పేరుతో కూడా కేంద్రం నురచి మరో వత్తిడి పెరుగుతోరది.
 

                                                                      మరో లేఖతో వత్తిడితో

అయినప్పటికీ కేంద్రం నురచి నిధులపై వత్తిడి రోజురోజుకూ పెరిగిపోతున్న ట్లు సమాచారం. తాజాగా కేంద్రం నురచి మరో లేఖ రాష్ట్ర ఆర్థికశాఖకు చేరినట్లు తెలిసిరది. ఇరదులో ఏకంగా 2019 కోట్లు ఇరకా ఎస్‌ఎన్‌ఎ ఖాతాల్లోకి చేరలేదని చెబుతూ ఆ నిధులపై ఆరా చేసిరది. ఈ నిధులు ఎరదుకు జమ చేయలేదని కూడా ప్రశ్నిరచినట్లు తెలిసిరది. అయితే నిధుల్లో కొరత భాగాన్ని ఇతర అవసరాలకు వాడుకోవడం వల్లనే ఆ నిధులను ఎస్‌ఎన్‌ఎ ఖాతాలోకి జమ చేయడం సాధ్యం కాలేదని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.