అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్ పేపర్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వెల్లడించింది. సైన్స్ ప్రశ్నపత్రం నమూనా కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. ఆంగ్లం, గణితం, సోషల్ స్టడీస్ పేపర్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.