Aug 24,2023 13:36

ఆసియా కప్‌-2023 మీద భారత ఆటగాళ్లు సఔష్టి సారించారు.. ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఈ వన్డే టోర్నీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు కోహ్లి బెంగళూరుకు చేరుకున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో వారం రోజుల పాటు జరుగనున్న ట్రెయినింగ్‌ క్యాంపులో భాగం కానున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైనట్లు కోహ్లి తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు కోహ్లి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టాడు. టెస్టులో 17.2 స్కోర్‌ చేసినట్లు ఫొటో పంచుకున్నాడు. కాగా కోహ్లితో పాటు విండీస్‌ టూర్‌ తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా సహా మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ తదితరులు కూడా ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరు కానున్నారు.