టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ విరాట్‌కు ఎంతోమంది అభిమానులున్నారు. పాక్‌లోని బలూచిస్థాన్‌కు చెందిన కొంతమంది ఫ్యాన్స్ కోహ్లీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఇసుకతో విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీశారు. అనంతరం ఆ భారీ చిత్రాన్ని డ్రోన్‌తో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది కూడా వీరు ఇలానే ఇసుకతో కోహ్లీ చిత్రాన్ని గీసీన విషయం తెలిసిందే.
A beautiful sand work done by Virat Kohli fans from Balochistan. pic.twitter.com/CfZ0wCowYo
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2023










