
ప్రజాశక్తి, అమరావతి : తెలుగు భాషను అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రోత్సహించాలని, ఇందుకు తీసుకున్న చర్యలను నివేదించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అధికార భాష తెలుగును అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏలూరులోని ఆశ్రమం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం మరోసారి విచారణ జరిపింది. విచారణ 3కు వాయిదా వేసింది.