న్యూఢిల్లీ : దేశంలోని కనీస వేతనం లేని కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఓ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. స్వయం ఉపాధి కేటగిరీ కింద ప్రభుత్వం వీరిని చేర్చినప్పటికీ.. కనీస వేతనాలు పొందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఉదాహరణకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కార్మికులతో పాటు చిన్నపాటి దుకాణాలు, విక్రయ సంస్థల్లో పనిచేసేవారికి కనీస వేతనం పొందే అవకాశం ఉండడం లేదని, కనీస వేతనం కన్నా తక్కువ వేతనాలు పొందుతున్నారని అన్నారు.
కనీస వేతనం లేని కార్మికుల సంఖ్యలో భారీ వృద్ధి నమోదవుతోందని ప్రభుత్వానికి చెందిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. ప్రొఫెసర్ సంతోష్ మెహ్రోత్రా మాట్లాడుతూ... 2017-18లో 40 మిలియన్లుగా ఉన్న వేతనం లేని కార్మికుల సంఖ్య 2022-23 నాటికి 95 మిలియన్లకు చేరిందని అన్నారు. అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఒ) ఈ కార్మికులను ఉద్యోగిగా గుర్తించదని, ఈ విధానం 92 దేశాల్లో ఉందని అన్నారు. అయితే ఇండియాలో ఈ కార్మికులు మూడింట ఒకవంతు స్వయం ఉపాధి కేటగిరిలో ఉన్నారని అన్నారు. 2017-18లో మొత్తం ఉపాధిలో వీరి వృద్ధి 52 శాతం ఉండగా.. 2022-23లో మొత్తం ఉపాధిలో వీరి వృద్ధి 58 శాతానికి పెరిగింది. ఇటీవల కాలంలో మహిళలు, యువత కూడా సైన్యంలో చేరుతున్నారని అన్నారు.
ప్రభుత్వ సర్వేలోని మరో కీలక సమాచారం ప్రకారం.. సగటు నెలవారీ వేతనాలు 2017-18 మధ్య రూ.19,450గా ఉండగా, 2022-23లో రూ.20.039 కన్నా ఎక్కువ లేదా తక్కువ నిలిచిపోయాయి. గడిచిన ఐదేళ్లలో సగటు వేతనాలలో ఎలాంటి పెరుగుదల లేదని ఈ సర్వే చూపుతోంది. ఇది ఉపాధి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
స్వయం ఉపాధి సైన్యంతో దానిలో పెరుగుతున్న వేతనం లేని కార్మికులతో ముడి పడి ఉంది. కొనుగోలు శక్తి పడిపోవడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో... ఇటీవలి కాలంలో హిందుస్థాన్ లీవర్, బజాజ్ ఆటో వంటి కంపెనీలకు గ్రామీణ డిమాండ్ తగ్గిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.