Jun 25,2022 12:54

ప్రజాశక్తి-నందిగామ (కృష్ణా) : నిషేధిత భూముల జాబితా సెక్షన్‌ 22 - ఎ నుండి తొలగింపు మేళాను శనివారం నందిగామ లో శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు ప్రారంభించారు. నందిగామ ఆర్డీవో ఎ.రవీంద్రరావు, తహసీల్దార్‌ నరసింహరావలు కలిసి నందిగామ తహసీల్దార్‌ కార్యాలయంలో 22-ఎ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ... నిషేధిత భూముల తొలగింపు అర్జీలను పరిష్కరిస్తామన్నారు.