Oct 19,2022 21:24

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో కొత్తగా 1000 ప్రాపర్టీలను జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓయో వెల్లడించింది. గడిచిన జనవరి నుంచి సెప్టెంబర్‌ నాటికి 600 స్టోర్‌ఫ్రంట్‌లను తమ వేదికపైకి తీసుకువచ్చామని పేర్కొంది. వచ్చే డిసెంబర్‌ ముగింపు నాటికి మరో 400 ప్రాపర్టీలను జోడించనున్నామని తెలిపింది. తిరుపతి, గోవా, పాండిచ్చేరి, సిమ్లా తదితర నగరాలపై దృష్టి పెడుతున్నామని పేర్కొంది.