వర్తమాన రాజకీయాలు మనకు
రోత పుడుతున్నాయి రోజురోజుకి ..!
ఈ రొంపి చెర లోకి రావాలంటే
కొత్తవారు కొంత భయపడుతున్నారు..!!
బట్టలు మార్చుకున్నంత సులువుగా
బడా నేతలు పార్టీలు మార్చుతున్నారు!
గుండీలు లాగినంత ఈజీగా
నాయకులు జెండాలను వీడుతున్నారు..!
ఆ రాజకీయ పార్టీల్లో....
ధనవంతులకూ బలవంతులకే సీట్లు ..!
సేవామూర్తులకు లేవు బెర్త్‌లు
గుణవంతులకు లేవు పదవులు..!?
రకరకాల శక్తులతో నిండీ
నేటి రాజకీయాలు చెత్తకుండీలా మారి
యువతరాన్ని కంపు కొట్టిస్తున్నాయి..!
మేథో వర్గాలకు అసహ్యం పుట్టిస్తున్నాయి..!
సామాన్యుడి గోడును పేదవాడి గొంతును
చట్ట సభల్లో వినిపించి...చందన చర్చలు చేసే
స్వచ్ఛ రాజకీయాలు రావాలి...కావాలి ..!
ప్రజానేతలను ఎన్నుకునే తరుణం రావాలి...!
- జి. సూర్యనారాయణ, దివిసీమ.