బడి ఈడు పిల్లలం
మేము బడికి పోతాము
పలక బలపం పట్టుకొని
అక్షరాలను నేర్చేస్తాము
గుణింతాలు చక్కగా నేర్చి
పదాలు అన్ని చెప్పేస్తాము
గేయాలను పాడుకుంటూ
ఆనందంగా గడిపేస్తాము
పదం పదం కలుపుకుంటూ
వాక్యాలను నిర్మిస్తాము
పాఠాలలో బొమ్మలు చూస్తూ
వాటి గురించి మాట్లాడేస్తాము
గురువులు చెప్పే తరగతులన్నీ
శ్రద్ధగా వింటాము
ఇంటి పనిని చక్కగా చేస్తూ
క్రమశిక్షణగా పయనిస్తాము
చదువుల ఒడిలో చక్కగా ఉంటాం.
విజ్ఞానం పెంచుకుంటాం
బడికి పోతాము
మేము బడికి పోతాము
చదువుల గుడిలో అన్నీ నేర్చి
భవితను చక్కగా తీర్చిదిద్దుకుంటాము!
- మొర్రి గోపి
88978 82202










