May 14,2023 10:49

హాయ్ ఫ్రెండ్స్‌!
ఎలా ఉన్నారు? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నేను మా స్కూలు టీచర్స్‌, పిల్లలు అందరూ విహార యాత్రకు వెళ్లాం. వెళ్లేటప్పుడు బస్సులో బాగా గోల చేశాం. కేరింతలు కొడుతూ, పాటలు పాడుతూ ప్రయాణించాం. మొదట నెల్లూరు జిల్లా రాజ రాజేశ్వరి ఆలయానికి వెళ్లాం. అక్కడ నుండి శ్రీ నరసింహ స్వామి కొండ ఎక్కాం. ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉన్నా..ఎక్కాక చాలా బాగుంది. చుట్టూ ప్రదేశం ప్రశాంతంగా అనిపించింది. పక్క ఆంజనేయ స్వామిని బండరాయిపె ౖ చెక్కి ఉన్నారు. అక్కడ అందరం ఫోటోలు తీసుకున్నాం. అక్కడ నుంచి మైపాడు బీచ్‌కి వెళ్ళాం. బీచ్‌లో చాలా సేపు ఆనందంగా గడిపాం. రకరకాల గవ్వలు ఏరుకుని, ఇసుకలో ఇళ్ళు కట్టు కుని సరదాగా అందరం ఆడుకున్నాం. మా ఉపాధ్యాయులు బాలసుబ్రమణ్యం సార్‌, భార్గవి మేడం, వాళ్ళ అబ్బాయి సుజరు చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకున్నారు. సాయంత్రం కాగానే తిరుగు ప్రయాణంలో వెంకయ్య స్వామి గుడి దర్శించుకుని అక్కడే అన్నదానంలో అందరం భోజనాలు, పులిహోర ప్రసాదాలు తిన్నాం. రకరకాల బొమ్మలు కొనుక్కుని ఇంటికి చేరాం. నేస్తాలు మరి మీరూ ఏమైనా కొత్త ప్రదేశాలు చూశారా? అయితే వేసవి విడిదిలో చెప్పండి.
veena

- సి. వీణ,
5 వ తరగతి, పెన్నలపాడు,
తొట్టంబేడు మండలం, తిరుపతి జిల్లా.