ప్రజాశక్తి-పోడూరు (పశ్చిమ గోదావరి) : మండలంలోని వద్దిపర్రు గుమ్మలురు గ్రామాల మధ్య ఉన్న నక్కల డ్రైన్ అధిక వర్షాలకు పొంగి ఆర్ అండ్ బి రోడ్డు మీదకు వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం వల్లూరు నుండి పాలకొల్లు వెళ్ళే ప్రయాణికుల రాకపోకలు స్తంభించాయి. చాలా వరకు పంట పొలాలు నీట మునిగిపోయాయి.










