Oct 31,2022 07:52

ఇది ప్రజాస్వామిక పాలనా విధానం
ఇక్కడ సామాన్యుడిదే సింహాసనం
చట్టం ముందు అందరూ సమానం
న్యాయం అందించడమే ప్రధానం
అన్నది ఒక ఆదర్శ భాషణం
నిజానికి నేడు,
శాసనం పెద్దవాడికి పాద భూషణం
పేదవాడిని చూస్తే అది వేస్తుంది శీర్షాసనం
మేలుకున్నప్పుడే జనం..
మేలు పొందడం సాధ్యం.
 

- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ,
94408 36931