Oct 05,2023 14:10

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రచిన్‌ రవీంద్ర అద్భుతమైన సెంచరీ సాధించాడు. 82 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. రచిన్‌కు కెరీర్‌లో ఇది తొలి శతకం. మరో ఎండ్‌లో కాన్వే (111) ఆడుతున్నారు.

  • డెవాన్‌ కాన్వే 100.. న్యూజిలాండ్‌ 200/1

న్యూజిలాండ్‌ బ్యాటర్లు డెవాన్‌ కాన్వే 84 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో వైపు రచిన్‌ రవీంద్ర 74 బంతుల్లో 91 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ గెలవడానికి 23 ఓవర్లలో కేవలం 89 పరగులు మాత్రమే చేయాల్సి ఉంది.

  •  కాన్వే, రచిన్‌ హాఫ్‌ సెంచరీలు

న్యూజిలాండ్‌ బ్యాటర్లు డెవాన్‌ కాన్వే (62 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర (58 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 15 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 121/1గా ఉంది. న్యూజిలాండ్‌ గెలవాలంటే 35 ఓవర్లలో 162 పరుగులు చేయాలి.

  • విల్‌ యంగ్‌ డకౌట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ 2వ ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి విల్‌ యంగ్‌ డకౌటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 19/1గా ఉంది. డెవాన్‌ కాన్వే (11), రచిన్‌ రవీంద్ర (8) క్రీజ్‌లో ఉన్నారు.

  • ఇంగ్లాండ్‌ 282/9.. కివీస్‌ లక్ష్యం 283

వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లాండ్‌ 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్‌ (77) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జోస్‌ బట్లర్‌ 43, జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్‌ మలన్‌ 14, హ్యారీ బ్రూక్‌ 25, మొయిన్‌ అలీ 11, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ 20, సామ్‌ కరన్‌ 14, క్రిస్‌ వోక్స్‌ 11, అదిల్‌ రషీద్‌ 15, మార్క్‌ ఉడ్‌ 13 పరుగులు చేశారు.కివీస్‌ బౌలర్లలో హెన్రీ 3, గ్లెన్‌ ఫిలిప్స్‌ 2, మిచెల్‌ సాంట్నర్‌ 2, ట్రెంట్‌ బౌల్ట్‌, రచిన్‌ రవీంద్ర, ఒక్కో వికెట్‌ తీశారు.

  • తొమ్మిదో వికెట్‌ డౌన్‌

252 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి సామ్‌ కర్రన్‌ (14) ఔటయ్యాడు.

  • క్రిస్‌ వోక్స్‌ ఔట్‌

250 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. సాంట్నర్‌ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి క్రిస్‌ వోక్స్‌ (11) ఔటయ్యాడు.

  • జో రూట్‌ ఔట్‌.. ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

77 పరుగులు చేసిన జో రూట్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఇంగ్లండ్‌ 229 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కర్రన్‌, క్రిస్‌ వోక్స్‌ క్రీజ్‌లో ఉన్నారు.

  • లివింగ్‌స్టోన్‌ ఔట్‌

221 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన స్లో బాల్‌కు లివింగ్‌స్టోన్‌ (20) ఔటయ్యాడు. జో రూట్‌ (72), సామ్‌ కర్రన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

  • ఐదో వికెట్‌ డౌన్‌.. 118/4.. ఇంగ్లండ్‌ 188/5

ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో వికెట్‌గా కెప్టెన్‌ బట్లర్‌ 43 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లివింగ్‌స్టన్‌, జో రూట్‌ (59) క్రీజ్‌లో ఉన్నాడు.
 

  • రూట్‌ హాఫ్‌ సెంచరీ..ఇంగ్లండ్‌ 166/4

జో రూట్‌ 57 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 166/4గా ఉంది. రూట్‌తో పాటు జోస్‌ బట్లర్‌ (30) క్రీజ్‌లో ఉన్నారు.

  •  మొయిన్‌ అలీ క్లీన్‌ బౌల్డ్‌.. 

ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ (11) క్లీన్‌ బౌల్డయ్యాడు. జో రూట్‌ (32) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లాంగ్‌ 21.2 ఓవర్ల తరువాత 118/4గా ఉంది.

  • మూడో వికెట్‌ డౌన్‌.. ఇంగ్లాండ్‌ 94/3

రచిన్‌ రవింద్ర బౌలింగ్‌ హ్యారీ బ్రూక్‌ డెవాన్‌ కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. హ్యారీ బ్రూక్‌ 16 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్‌ సాయంతో 25 పరుగులు చేశాడు. ఇంగ్లాంగ్‌ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌ (20), మొయిన్‌ అలీ ఉన్నారు.

  • బెయిర్‌స్టో ఔట్‌.. ఇంగ్లాండ్‌ 64/2

దాటిగా ఆడుతున్న బెయిర్‌స్టో వ్యక్తి గత స్కోరు 33 పరుగుల వద్ద సాంట్నర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజ్‌లో జో రూట్‌ (15), హ్యారీ బ్రూక్‌ ఉన్నారు. ఇంగ్లాండ్‌ 13 ఒవర్లలో 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.

  • తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

40 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. డేవిడ్‌ మలాన్‌ 14 పరుగులు చేసి మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. జానీ బెయిర్‌స్టో (24) క్రీజ్‌లో ఉన్నాడు.

  • టాస్‌ గెలిచిన కివీస్‌.. తొలుత బౌలింగ్‌

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌- గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య వన్డే వరల్డ్‌కప్‌-2023 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీలో టామ్‌ లాథమ్‌ న్యూజిలాండ్‌కు సారథ్యం వహించనున్నాడు. గాయం కారణంగా బెన్‌ స్టోక్స్‌ ఈ మ్యాచ్‌లో తుది జట్టులో లేడు.

తుది జట్లు:
న్యూజిలాండ్‌ :
డెవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, టామ్‌ లాథమ్‌(వికెట్‌ కీపర్‌/ కెప్టెన్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్‌, మాట్‌ హెన్రీ, మిచెల్‌ శాంట్నర్‌, జేమ్స్‌ నీషమ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌

ఇంగ్లండ్‌ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలాన్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌/ కెప్టెన్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌.