మత ప్రమేయం లేని లౌకిక రాజ్యంలో
మతమే రాజ్యమేలుతుంటే..
కుల రహిత సమాజ నిర్మాణంలో
కులానికే అగ్ర తాంబూలమిస్తుంటే..
పాఠాలకే తప్ప ప్రజలకు చేరువ కాక
ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే..
ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఓటుని
పచ్చనోటుకి అమ్ముకుందామా...!
నోటుకు అమ్ముడు పోయి
మరో ఐదేళ్లు బానిసగా బతికేద్దామా..!
కుల మతాల చిచ్చు పెట్టి
వర్గ విబేధాలు సృష్టించి
ఆచరణలో వీలుకాని హామీలు గుప్పించి
యేరు దాటాక తెప్ప తగలేసే
ఈ రాజకీయ మహానుభావులకు
ఓటుతో ధీటుగా బదులిస్తూ
స్వచ్ఛ రాజకీయాలకు స్వాగతమంటూ
సరికొత్త స్వతంత్ర భారతావనిని నిర్మిద్దామా..!
- కంది సత్యనారాయణమూర్తి
సెల్: 9030277529










