Oct 03,2023 16:02

ప్రజాశక్తి-అమలాపురంరూరల్‌(కోనసీమ) : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు వూటుకూరి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మంగళవారం తెలియజేశారు. ఈనెల 2 గాంధీ జయంతి రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో సంఘం జాతీయ మహాసభ జరిగిందని, అందులో 60 మందిని నూతన కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగిందని, ఆ కార్యవర్గంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రముఖ కార్టూనిస్టు మాడా రాముని ఎన్నుకోవడం జరిగిందని వీరభద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా సంఘానికి చెందిన ప్రముఖులు, బండారులంక గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు వారికి అభినందనలు తెలియజేశారు.