ఓ ప్రజా కంఠం అస్తమించింది
ఒక తరం
విప్లవ పాట మూగబోయింది
చైతన్యగీతంతో మార్మోగిన
ఓ పొరాట స్వరం
గుండె ఆగిపోయింది
చరిత్ర పుస్తకంలో గద్దర్ పేజీ
చిరస్మరణీయమైపోయింది
రాజకీయ అస్తిత్వ సునామీలో
పోరుబాటై ప్రతిధ్వనించి
తిరుగుబాటు సంద్రంలో
ప్రజా యుద్ధ కెరటమై
ఎగిసిపడిన అస్తిత్వ చిరునామా .. గద్దర్
నాడు చైతన్య కెరటమై
నేడు గళం వీరుడై
ఒగ్గుకథై బుర్రకథై
పోరుగీతమై జనం గుండెచప్పుడై
కాలానికి ఎర్రబాటై నిలిచాడు
కోట్లాది మంది హదయాల్లో
ఆరని జ్వాలై
రగులుతున్న నిప్పురవ్వల కొలిమై
ఎగిసే వెలుగు మంటల్లో
చిరస్థాయిగా గద్దర్
ప్రకాశిస్తూనే ఉంటాడు !
- రెడ్డి శంకరరావు
94943 33511










