Nov 15,2023 15:44

చెన్నూరు : చెన్నూరు నియోజకవర్గంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత వివేక్‌ వెంకట స్వామి డబ్బులు పంచుతున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ ని కలిసి వివేక్‌ పై ఫిర్యాదు చేశారు. చెన్నూరూ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ విచ్చవిడిగా డబ్బులు పంచుతున్నారని అన్నారు. వివేక్‌ పక్కన ఉన్న వారి అకౌంట్స్‌ లోకి డబ్బులు జమ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్‌ మెంట్‌,ఇన్కమ్‌ టాక్స్‌ వాళ్లకు పిర్యాదు చేస్తామన్నారు. అకౌంట్స్‌ ని ఫ్రీజ్‌ చేయాలని సీఈఓని కోరామన్నారు. వివేక్‌ కుటుంబ సభ్యుల అకౌంట్స్‌ పై నిఘా పెట్టాలని సీఈఓని కోరామన్నారు. పెట్రోల్‌, బిల్డర్స్‌, రైస్‌ మిల్స్‌, సిమెంట్‌, స్టిల్‌ కంపెనీల వాళ్లకు డబ్బులు హైదరాబాద్‌ నుంచి పంపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక్‌ కుటుంబం చేస్తున్న పాపంలో పాలు పంచుకోవద్దని వ్యాపారులను కోరుతున్నామన్నారు.