న్యూఢిల్లీ : శుక్రవారం నుంచి ఎనిమిది రోజుల పాటు భారత్‌లో భూటన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడం, భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకూ ఈ అధికారిక పర్యటన సాగుతుందని తెలిపింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భూటాన్ రాజు భేటీ కానున్నారు. వివిధ అంశాలపై చర్చిస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, ప్రభుత్వ సీనియర్ అధికారులతోనూ భూటన్ రాజు సమావేశం కానున్నారు. అస్సాం, మహారాష్ట్రల్లోనూ వాంగ్‌చుక్ పర్యటించనున్నారు.