బీజింగ్ : చైనా, భూటాన్ మధ్య సరిహద్దు చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల అధికారుల మధ్య అంగీకారం కుదిరింది. నైరుతి చైనా నగరమైన కన్‌మింగ్‌లో చైనా, భూటాన్ అధికారుల బృందం సరిహద్దు అంశంపై మూడు రోజులుగా జరుపుతున్న చర్చలు శుక్రవారంతో ముగిశాయి. మూడంచెల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సంయుక్త ప్రకటన పేర్కొంది. సాధ్యమైనంత త్వరలో చైనా-భూటాన్ 25వ దఫా సరిహద్దు చర్చలను నిర్వహించడంపై దౌత్య మార్గాల ద్వారా సంబంధాలను కొనసాగించనున్నామని తెలిపింది.