
తిరువనంతపురం: ప్రపంచకప్ ప్రారంభానికి ముందు తన రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమ్‌ఇండియా జట్టు తిరువనంతపురం చేరుకుంది. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుతో కలిసి రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు బిసిసిఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. కోహ్లి వ్యక్తిగత అత్యవసర కారణాలతోనే జట్టును వీడినట్లు ఆ అధికారి తెలిపారు. ఇక ఇంగ్లండ్ జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఐసిసి వన్డే ప్రపంచకప్‌ముందు భారత్ ఆడుతున్న చివరి వార్మప్ మ్యాచ్ ఇదే. నెదర్లాండ్స్‌తో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇక, ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 8న టీమిండియా.. ఆస్ట్రేలియాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.