
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే లక్ష్యం పట్ల అవగాహన.. కృషి.. నైపుణ్యం ప్రదర్శించాలి. ఓ గ్రామీణ యువతి జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదగాలంటే కొన్ని వేల గంటల శిక్షణ అవసరమే! ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొనాలనే కలను నిజం చేసుకోవాలంటే సంవత్సరాల తరబడివారు ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలాంటి కఠోర దీక్షతో ప్రపంచ ఒలింపిక్స్‌లో బారత్ జట్టు తరపున ఆటడానికి సిద్ధమంటున్నారు మనెడి హారతి. పేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు తాండవం.. అయినా తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకూ వెనుకంజవేయబోనంటూ ఆమె శపథం చేశారు.

ఓటమికి భయపడితే ఆటైనా..జీవితమైనా అక్కడే ఆగిపోతుంది. విజయం కావాలంటే గమనం మార్చుకోవాల్సిందే. లక్ష్యం విజయ పథాన నడిపిస్తుంది. ఇందుకు ఆమె జీవితం నిదర్శనం. కృషీ..పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యానైనా అలవోకగా సాధించొచ్చుననీ, పేదరికం లక్ష్యానికి అడ్డుకాదని నిరూపించారని బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి మనెడి హారతి. ఓ వైపు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు. మరో వైపు తండ్రి సంపాదన అంతంతమాత్రం. తల్లి గృహిణి. ఆమెకు అక్క కూడా ఉన్నారు. వీరి కుటుంబం అంతా బాధల మయమే. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే తానూ ఏదో ఒకటి సాధించాలని కంకణం కట్టుకుంది పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన మనెడి హారతి.
అందరిలాగే తానూ ఉండకూడదని నిర్ణయించుకుంది. జీవితంలో ఏదో సాధించాలనే కంకణం కట్టుకుంది. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. స్ఫూర్తిదాయక విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈమె తండ్రి నాగేశ్వరరావు చికెన్ దుకాణం నడుపుతున్నారు. తల్లి చంద్రకళ గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్న కుమార్తె హారతి. క్రీడల్లో చూపిన ప్రతిభ ఆధారంగా చెన్నైలోని హిందుస్థాన్ యూనివర్సిటీలో ఉచిత డిగ్రీ సీటు సాధించి విద్యనభ్యసిస్తున్నారు. కాకినాడ ఏపీఎస్పీలో 8వ తరగతిలోచదువుతున్నప్పుడు అక్కడ కోచ్ బాస్కెట్ బాల్ ఆడేలా ప్రోత్సహించారు. తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో ఆటల్లో సత్తా చాటింది. అనేక పతకాలు, బహుమతులు సాధించి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలను అందుకున్నారు.
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారునిగా గుర్తింపు
బాస్కెట్‌బాల్ ఆడటానికి సహజమైన నైపుణ్యం అవసరం. అథ్లెటిసిజం (బలం, శక్తి, శీఘ్రత, సమతుల్యత, చురుకుదనం, ప్రతిచర్య మొదలైనవి) మెరుగుపరచడం ద్వారా బాస్కెట్‌బాల్ నైపుణ్యాలను (షూటింగ్, బాల్ హ్యాండ్లింగ్, పాసింగ్, రీబౌండింగ్ , డిఫెండింగ్) అనతికాలంలోనే ఆమె అందిపుచ్చుకున్నారు. నడుస్తున్నప్పుడు (డ్రిబ్లింగ్) బంతిని బౌన్స్ చేయడం ద్వారా , సహచరుడికి పంపడం ద్వారా ముందుకు సాగటంలో మంచి పరిణితి సాధించారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు బాస్కెట్‌బాల్ పోటీలో రాణించడంతో ప్రతిభ ఆధారంగా చెన్నైలోని హిందూస్థాన్ కళాశాలలో చదువుకునే అవకాశాన్ని దక్కించుకున్నారు.
అద్భుతమైన ప్రతిభ..
మనెడి హారతి ఏపీఎస్పీలో కాకినాడ లో 8వ తరగతి ఇంగ్లీష్ మీడియం, సీసలి ఉన్నత పాఠశాల, కళాశాలలో తన క్రీడాప్రతిభ ప్రదర్శించడం ద్వారా మహిళల బాస్కెట్‌బాల్‌పై చెరగని ముద్ర వేసింది. హైస్కూల్ స్థాయిలోనే ఆమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు వెళ్లేలా ప్రోత్సహించారు. ఐదేళ్ల కిందట వేసవి శిక్షణ శిబిరంలో తొలిసారి బాస్కెట్ బాల్ ఆడిన హారతి అప్పటినుంచి పట్టుదలతో సాధన సాగిస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్నారు.పాఠశాల చరిత్రలో అత్యంత నిష్ణాతులైన క్రీడాకారిణుల్లో ఒకరిగా నిలిచింది. మహిళల బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. నిత్యం సాధన చేయడం అలవాటుగా మారింది. 2022లో మధ్య ప్రదేశ్‌లో జరిగిన యూత్ నేషనల్స్, యూత్ ఇండియా ట్రయల్ టోర్నీ, చిత్తూరులో జరిగిన సీనియర్, జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఇప్పటివరకు 15 పతకాలు సాధించారు. జూన్ 6 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన జాతీయ బాస్కెట్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.నాలుగు జాతీయ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొని మెరుగైన ప్రతిభను చాటారు.

జాతీయ పోటీల్లో 'హారతి' జయకేతనం
2018 మినీ నేషనల్స్‌లో (ఒడిస్సా), 2018 అండర్ 14 జాతీయులులో (ఛత్తీస్‌గఢ్), 2019-20లో అండర్ 14 విభాగంలో జాతీయ జట్టుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిలో హారతి ఒకరు. కోవిడ్ కారణంగా అప్పట్లో పోటీలు జరగలేదు. ఢిల్లీలో జరిగిన పోటీల్లో బిహార్ జట్టుపై విజయం సాధించారు. 2022 యువ జాతీయుడు (మధ్యప్రదేశ్)లో 2023, 2023 అండర్ 19 (ఢిల్లీ)లో జూనియర్స్, సీనియర్స్ జాతీయ శిబిరం (చిత్తూరు), 2021 బెంగుళూరులో భారతీయ మార్గాలు, అండర్ 14 అంతర్ జిల్లాల్లో 1వ స్థానం (2018), మినీ అంతర్ జిల్లాల్లో 3వ స్థానం (2018), జూనియర్ అంతర్ జిల్లాల పోటీల్లో 2వ స్థానం (2022), సీనియర్స్ అంతర్ జిల్లాల పోటీల్లో 2వ స్థానం (2022), జూనియర్స్ అంతర్ జిల్లాల పోటీల్లో 1వ స్థానం (2023), యూత్ అంతర్ జిల్లా 2వ స్థానం (2022), అండర్ 19 అంతర్ జిల్లాల పోటీల్లో 1వ స్థానం సాధించారు.
- గొట్టేటి శ్రీనివాసులు,
కాళ్ళ మండలం,
పశ్చిమ గోదావరి జిల్లా.

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తా ...
ప్రపంచ స్థాయి ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే నా లక్ష్యం. 8వ తరగతిలో కాకినాడ ఏపీఎస్పీలో చదువుతున్నప్పుడు అక్కడ కోచ్ బాస్కెట్ బాల్ ఆట ఆడేలా ప్రోత్సహించారు. ఆ సమయంలో ఎస్‌ఏఏపీ అకాడమీ సెలక్షన్ వచ్చింది. అప్పటినుంచి బాస్కెట్ బాల్ ఆటపై ఆసక్తి పెంచుకుని రాణిస్తున్నాను. అకాడమీలో కోచ్ వినోత్ కుమార్ బాగా ఆడేలా ప్రోత్సహించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాన. భవిష్యత్తులో భారత జాతీయ జట్టులో స్థానం కోసం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేస్తున్నాను. నా విజయాల్లో కోచ్‌ల కృషి ఎంతో ఉంది.
- మనెడి హారతి