May 08,2023 08:28
  •  పారిశుధ్యం మరింత అధ్వానం
  •  రోగాలబారిన భవన నిర్మాణ రంగ కార్మికులు
  •  ఒకరు మృతి
  •  పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
  •  బాధితులను పరామర్శించిన సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా) :  తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో నిర్మిస్తున్న ఐసర్‌ (ఇండియన్‌ ఇన్స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌)లో భవన నిర్మాణ రంగ వలస కార్మికులు అడుగడుగునా వివక్షకు గురవు తున్నారు. కనీస మౌలిక వసతులకు నోచుకోక దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్‌ ఆ వలస కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించుకుంటూ కనీసం వారి యోగక్షేమాలు పట్టించుకోని పరిస్థితి. దీం తో ఐసర్‌ నిర్మాణంలో భాగస్వాములైన సుమారు 1100మంది వలస కార్మికులు నిత్యం అనా రోగ్యం భారిన పడుతూ సతమతమవు తున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా సుమారు 30మంది కార్మికులకు సుస్తి చేయడంతో కాంట్రాక్టరే ఎవరికి తెలియ కుండా ప్రైవేటుగా వైద్యం చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సుశీల్‌ కుమార్‌(33) అనే కార్మికుడు శని వారం తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యలో మరణించడం గమనార్హం. వివరాల్లోకి పోతే...

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాల పల్లి వద్ద నిర్మిస్తున్న ఐసర్‌ లో మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, చండీగర్‌ రాష్ట్రాలకు చెందిన సుమారు 1100 మంది భవన నిర్మాణంగా వలస కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా డిఇసి కంపెనీ పరి ధిలో ఒప్పంద కార్మికులుగా ఐసర్‌ నిర్మాణాలను చేపడు తున్నారు. అయితే సదరు కంపెనీ వీరికి వసతి సదు పాయాలు కల్పించకపోవడంతో కార్మికులంతా రేకుల షెడ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేకులషెడ్ల వద్ద కనీస మౌలిక వసతులు లేకపోవడంతో మలం, మూత్ర విసర్జన అక్కడే చేయాల్సి రావడం విచారకరం. కార్మికులు నివసించే చోట ఏమాత్రం పరిశుభ్రత లేకపోవడంతో నిత్యం వ్యాధులు భారినపడాల్సి వస్తోంది.
ఈనేపథ్యంలోనే గత మూడు రోజులు గా 30మంది కార్మికులు తీవ్ర అశ్వస్థత కు ఆసుపత్రి పాలయ్యారు. శనివారం సునీల్‌ కుమార్‌ అనే కార్మికుడి పరిస్థితి విష మించడంతో ఆయన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. అయితే ఐసర్‌ వద్ద కార్మికులకు ఏర్పాటు చేసిన నివాస ప్రాంతం లో కనీస మౌలిక వసతులు లేకున్నా, కార్మికులు తరచూ అనారోగ్యం పాలవుతున్నా సదరు కంపెనీ పట్టించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని తెలుస్తోంది. కార్మికుల అశ్వస్థత విషయం వైద్యాధికారులు తెలియ డంతో ఆదివారం కంటితుడుపు చర్యగా మెడికల్‌ క్యాం పు నిర్వహించి మమ అనిపించారు. అయితే ఐజర్‌ వద్ద పరిస్థితులు అదుపులోకి రాని పరిస్థితి. కొందరు తీవ్ర అనారోగ్యం భారినపడి ప్రైవేట్‌ హాస్పిటల్‌కి వెళ్లినా వారి ఆచూకీ తెలియడం లేదు. కొందరు తీవ్ర భయాందోళ నలకులోనై కంపెనీ వారికి కూడా చెప్పకుండా బయట కు వెళ్లిపోయినట్లు సమాచారం. ఐజర్‌ వద్ద భవన నిర్మాణరంగా వలస కార్మికుల పట్ల ఇంత వివక్ష జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపో వడం విచారకరం. కనీసం ఐసర్‌ వద్దా ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు వారి వివరాలు కూడా అధి కారుల రికార్డుల్లో లేకపోవడం దురదష్టకరం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి అయితే నిర్మాణం లో భాగస్వాములైన వలస కార్మికులకు సత్వరమే అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించి, నివాస ప్రాంతంలో కనీస మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి: సిఐటియు

జంగాలపల్లి ఐసర్‌ వద్ద భవన నిర్మాణ రంగా వలస కార్మికుల కేటాయించిన నివాస ప్రాంతాన్ని ఆదివారం సిఐటియు నాయకులు పరిశీలించారు. అక్కడ కార్మికులకు కేటాయించిన రేకుల షెడ్లను, అపరిశుభ్ర పరిస్థితులను చూసి విస్తుపోయారు. కార్మికులకు కేటాయించిన నివాస ప్రాంతం పశువుల కొట్టం కంటే దారుణంగా ఉందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, రంగయ్య వాపోయారు. డీఈసీ కంపెనీ నిర్లక్ష్యం వల్లే సునీల్‌ కుమార్‌ అనే కార్మికుడు మతి చెందాడనీ, ఆయన కుటుంబానికి కంపెనీ రూ.25లక్షలు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అనారోగ్యం పాలైన కార్మికుల వైద్య సదుపాయాలకయ్యే ఖర్చు మొత్తాన్ని కంపెనీ భరించాలని స్పష్టం చేశారు. వలస కార్మిక చట్టాలను అమలు చేసి కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.