విశాఖ : నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించడంలేదని విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్ వద్ద లీడ్ ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం గేటు వద్దకు వచ్చిన 80 మంది లీడ్ ఇంజనీరింగ్ కార్మికులు తమ విధులను బహిష్కరించి షిప్ యార్డ్ గేటు వద్ద నుంచి లేబర్ డిపార్ట్మెంట్ వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లి అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఇంతవరకు కార్మికుల జీత భత్యాల విషయంపై లీడ్ ఇంజనీరింగ్ సంస్థ నోరు మెదపడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంస్థ స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.










