Jul 24,2023 11:54

తిరుపతి : ' మీరిచ్చిన హామీలు.. నీటిమూటలేనా ? ' అంటూ ... టిటిడి అటవీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు సోమవారంతో వెయ్యి రోజులకు చేరాయి. ఈ సందర్భంగా ... నిరసనకారులకు మద్దతుగా, తిరుపతి వ్యవసాయ కళాశాల కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. టిటిడి అటవీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.