న్యూఢిల్లీ : రద్దు చేసిన మొబైల్ నెంబర్లను కనీసం మూడు నెలల తర్వాత వెరొక్కరికి కేటాయిస్తామని ట్రాయ్ వెల్లడించింది. రద్దు అయిన మొబైల్ నంబర్లను ఇతరులకు కేటాయించడం ద్వారా తర్వాత వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందని గతంలో సుప్రీంకోర్టులో కేసు నమోదయ్యింది. దీనిపై ట్రాయ్ కోర్టుకు వివరణ ఇస్తూ.. వినియోగదారుల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధి విధించినట్లు తెలిపింది. వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా 45 రోజుల పైబడి వాడకంలోని ఫోన్‌లలో ఆటోమెటిక్‌గా డేటా తొలిగిపోతుందని వాట్సాప్‌కు వివరణ ఇచ్చింది.