Apr 21,2023 12:36

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మండలంలోని ఏడిద గ్రామ సంత మార్కెట్‌ వద్ద సంఘం శరణం గచ్చామి అంబేద్కర్‌ నాటిక ప్రదర్శనకు సహాయ సహకారాలు అందించిన విద్యుత్తు ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ యడ్ల వెంకట్రావును పలువురు ఘనంగా గురువారం రాత్రి సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.జే విద్యాసాగర్‌, కవి, జానపద కళాకారులు ఎర్ర సూర్య, సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం సిఐటియు నాయకురాలు కే కృష్ణవేణి, వైసిపి నాయకులు వల్లూరి రామకృష్ణలు మాట్లాడుతూ అంబేద్కర్‌ నాటిక ప్రదర్శనకుహొ ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వెంకట్రావు కఅషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్‌ యూత్‌ నాయకులు యడ్ల సత్య, అందుకూరి సాయి, అందుకూరి రవికుమార్‌ తొర్లపాటి నాని, తొర్లపాటి సతీష్‌, కాశి సురేష్‌, సిహెచ్‌ సుందరం, వై.రమేష్‌, నల్లా జోషి, బూరిగ వీర్రాజు, అందుకూరి ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.