ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : అన్ని ఆధునిక వసతులతో మండపేటలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. పెద్ద కాలువ సమీపంలోని పాత వేర్ హౌస్ స్థలం వద్ద రూ 6.98 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని మంగళవారం రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఆయన పరిశీలించారు. రూ 5.48 కోట్లు నాబార్డు నిధులు రూ 1.50 కోట్లు పురపాలక సంఘ నిధులతో ఈ ఆసుపత్రి నిర్మాణపు పనులు చేపట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎన్నికల ముందే ఆసుపత్రి ప్రారంభించేలా అధికారులకు ఎంపీ బోస్, ఎమ్మెల్సీ తోటలు సూచనలు చేశారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో వేగంగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మండపేటలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యం తో దీనిని నిర్మాణం చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలోహొ మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, వైసీపీ నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధాకఅష్ణ, కర్రి పాపారాయుడు, ముమ్మిడివరపు బాపిరాజు, పోతంశెట్టి ప్రసాద్ లు ఉన్నారు.