పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలం : మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అన్నారు. మంగళవారం మండపేట పట్టణంలోని 28వ వార్డులో కౌన్సిలర్ మొండి భవాని మురళితో కలిసి రాణి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... వర్షాకాలం దఅష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. దోమలు, క్రిమి కీటకాలు ప్రబలకుండా ఉండేందుకుగాను ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువలేకుండా చూసుకోవాలన్నారు. పారిశుధ్యంపై ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, వైస్ చైర్ పర్సన్ పిల్లి గణేశ్వరరావు, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, యరమాటి వెంకన్నబాబు, ఇన్‌స్పెక్టర్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.