వానా వానా... రావమ్మా
వాకిలి తడిపి పోవమ్మా
వేయి చుక్కల ముగ్గు వేసెదము!
వానా వానా... రావమ్మా
దాహం తీర్చి పోవమ్మా
దండం నీకు పెట్టెదము!
వానా వానా... రావమ్మా
మట్టి తడిపి పోవమ్మా
మొక్కలు నాటి పెంచెదము!
వానా వానా... రావమ్మా
వాగులు నింపి పోవమ్మ
వనాల్లో ఊయల ఊగెదము!
వానా వానా... రావమ్మా
పుడమిని పచ్చగ చేయమ్మ
హారతులు నీకు పట్టెదము !
- బోనగిరి పాండురంగ, తొర్రూరు.










