Aug 26,2023 20:25

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జైరామ్‌ రమేష్‌తో ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ఢిల్లీలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రైతాంగ సమస్యలపై సంయుక్త కిసాన్‌ ఆధ్వర్యంలో పోరాడుతున్న సి2ప్లస్‌ 50 శాతం చట్టబద్ధత, ఎమ్‌ఎస్‌పి అమలు ఆవశ్యకత, ఎలక్ట్రిసిటీ బిల్లుల వల్ల నష్టాలు, తదితర అంశాల గురించి ప్రతినిధుల బృందం ఆయనకు వివరించింది. రైతాంగ సమస్యలను రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని జైరామ్‌ రమేష్‌ హామీ ఇచ్చారు. ప్రతినిధి బృందంలో అఖిల భారత విద్యుత్‌ ఇంజినీర్ల సమాఖ్య పాట్రన్‌ కె అశోక్‌రావు, కెఎల్‌ రావు ఫౌండేషన్‌ అధ్యక్షులు కె విజరురావు ఉన్నారు.