
ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమగోదావరి) : ఏపీ వెలుగు (యానిమేటర్ల) ఉద్యోగుల సంఘం, విఓఎల హక్కుల సాధన కోసం చేపట్టిన జీపు జాత రెండో రోజు మార్టేరు చేరుకొంది. ఈ సందర్భంగా విఓఎ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అజరు కుమారి మాట్లాడుతూ.. యానిమేటర్ల వర్క్ చేసుకునేందుకు లోక్ యాప్ వర్క్ కోసం నాణ్యమైన 5జీ కలిగిన మొబైల్ ప్రభుత్వ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఓఎల మెర్జింగ్ ఆపాలని, గ్రూపులను బలోపేతం చేయాలన్నారు. మూడు సంవత్సరాల కాల పరిమితిని రద్దుచేసి గ్రూప్ ఇన్సూరెన్స్ రూ 10 లక్షలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మలాదేవి, ఆచంట అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగమణి, సిహెచ్ నరసమ్మ, పెనుగొండ అధ్యక్ష, కార్యదర్శులు వి.లక్ష్మి, సిహెచ్.అనురాధ, ఎం.లక్ష్మి , శేషారత్నం, రేవతి, సురేఖ, లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు.