Oct 21,2023 15:00

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వీఐపీ క్యూలైన్లు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఇంద్రకీలాద్రిపై వీఐపీ క్యూలైన్‌ ఎంట్రన్స్‌ వద్ద పోలీసులపై ట్రస్టుబోర్డు మెంబర్‌ చింత శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేయడానికి వచ్చారని తెలుసని.. అయితే ఏంటి అంటూ పోలీసులపై సీరియస్‌ అయ్యారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పాలకమండలి సభ్యులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. పోలీసులతో పాలకమండలి సభ్యుడు చింత శ్రీనివాస్‌ వాగ్వాదానికి దిగారు. పోలీసులను డ్యూటీ చేయనియకుండా పాలకమండలి సభ్యుడు అరగంట సేపు రణరంగంగా సఅష్టించారు. ''నీ లాంటి వాళ్ళను 10 మందిని బ్రతికించే దమ్ము నాకుంది'' అంటూ పాలకమండలి సభ్యుడు చింత శ్రీనివాస్‌ రెచ్చిపోయారు.