Oct 17,2023 16:02

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం జరిగింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై పాలకమండలి సభ్యులు మండిపడుతున్నారు. దర్శన సమయంలో పాలకమండలి కుటుంబ సభ్యులను పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా కుటుంబాలతో దర్శనం చేసుకుంటున్నారని పాలకమండలి సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ వారికి లేని ఆంక్షలు తమకు మాత్రమే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. తమ కుటుంబాలను టార్గెట్‌ చేయడం ఏంటని పాలకమండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.