
కాఫీ తోటలను రైతులతో కలిసి పరిశీలిస్తున్న వి. శ్రీనివాసరావు సిపిఎం పార్టీ చేపట్టిన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర అక్టోబర్ 30న ప్రారంభమైంది. పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర శుక్రవారం ఉదయానికి పెదబయలు మండలానికి చేరుకుంది. అక్కడ కాఫీ రైతులతో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ముచ్చటించారు. రైతులతో కలిసి కాఫీ తోటలను పరిశీలించారు.




