విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపాలని ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ యాత్రను జయప్రదం చేయాలని తిమ్మరాజుపేట గ్రామంలో ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. శనివారం ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కర్రి అప్పారావు, సిపిఎం మండల కన్వీనర్ ఆర్.రాము మాట్లాడుతూ ... పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మోడీ ప్రభుత్వం పోస్కో, అదాని, అంబానీలకు అప్పగించాలని కుట్రలు చేస్తుందని, దీనిని నిరసిస్తూ 950 రోజులుగా పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం మొండిగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. అందులో భాగంగా ప్రజలను చైతన్యపరిచి పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలని జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వామి కావాలని స్టీల్ పరిరక్షణ యాత్ర నెల 20 తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉత్తరాంధ్ర అన్ని జిల్లాలు, మండలాలు పర్యటించి ఈనెల 27వ తేదీన అచ్చుతాపురం వస్తున్నదన్నారు. ఈ యాత్రకు సాదరంగా స్వాగతించి ఈనెల 29వ తేదీన జరిగే బహిరంగ సభలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిమ్మరాజుపేట కార్యదర్శి ఎస్ రామ్ నాయుడు, వెంకట అప్పారావు, ఆదినారాయణ, నడుపూరు సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.